బౌద్ధ మతానికి ప్రతీకగా 'లింగాలకొండ'

బౌద్ధ మతానికి ప్రతీకగా 'లింగాలకొండ'

AKP: బొజ్జన్నకొండ, లింగాలకొండలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రాలు. అనకాపల్లికి సుమారు 3 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉంది. హీనయాన, మహాయాన, వజ్రయాన బౌద్ధ శాఖల ప్రభావం ఒకేచోట కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. అయితే, ఈ కొండపై ఉన్న రాతి స్థూపాలను దూరం నుంచి చూస్తే శివలింగాల వలె కనిపిస్తాయి. అందుకే స్థానికులు దీనిని 'లింగాలకొండ' అని పిలుస్తారు.