సెల్ ఫోన్లు అందజేసిన మంత్రి
PPM: మహిళా సంఘాల సభ్యులకు ఉత్తమ సేవలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం వివోఏలు పని చెయ్యాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాలూరు, మక్కువ, పాచిపెంట వివోఏలకు సెల్ ఫోన్లు అందించారు. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా తయారవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఉన్నతి, స్త్రీ నిధి రుణాలు అందజేశారు.