రహదారిపై బైక్ స్కిడ్ అవ్వడంతో వ్యక్తి మృతి

రహదారిపై బైక్ స్కిడ్ అవ్వడంతో వ్యక్తి మృతి

శ్రీకాకుళం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఎచ్చెర్ల- శ్రీకాకుళానికి బైక్‌పై వస్తుండగా ఆదిత్య పార్క్ ఎదురుగా స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి గార మండలం బైరికి చెందిన రంగా రావు కాగా, గాయపడిన లక్ష్మణ రావు ఈ వివరాలను తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నరు.