మాధవనగరం గ్రామంలో వర్షం
ASR: నాతవరం మండలం మాధవనగరంలో సోమవారం మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించాడు. కానీ సాయంత్రం 5 గంటలు తర్వాత వాతావరణం చల్లబడి మేఘాలు అలుముకొని మోస్తరు వర్షం పడింది. దీంతో ఇప్పటిదాకా ఎండకు విలవిల్లాడిన గ్రామస్థులకు కాస్త ఉపశమనం లభించింది. ఈ వర్షం వల్ల తాండవ ఆయకట్టులో నీరు చేరుతుందని.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.