వైద్య విద్యార్థికి ఎమ్మెల్యే నాయిని ఆర్థిక సహాయం

వైద్య విద్యార్థికి ఎమ్మెల్యే నాయిని ఆర్థిక సహాయం

హనుమకొండ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం వైద్య విద్యార్థి గణేష్‌కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆర్థిక సహాయం చేశారు. ప్రభుత్వ ఉచిత వైద్య సీటును పొందిన గణేష్ చదువుల కోసం పేదరికం అడ్డం కావడంతో ఎమ్మెల్యే స్పందించి చేయూతనందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉన్నంతగా చదివి మంచి పేరు సాధించాలన్నారు.