లొంగిపోయిన మరో 11 మంది మావోయిస్టులు
మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీకి చెందిన 11 మంది కీలక సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో డిజిటల్ కమిటీ మెంబర్ లాలు అలియాస్ మంగూ పోర్యామి, ఏరియా కమిటీ సెక్రటరీ కమలేష్ అలియాస్ గుండు జుగా ఉన్నారు. అలాగే ఏడుగురు కమాండర్ స్థాయి నేతలు, ఇద్దరు సెక్షన్ స్థాయి సభ్యులు ఉన్నారు. వీరిపై రూ.68లక్షల బహుమతి ఉన్నట్లు అధికారులు తెలిపారు.