నేడు జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కడప కలెక్టరేట్ సభా భవనంలోని నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపల్ స్థాయిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుందన్నారు. వివరాల కొరకు ఈ నంబరుకు 08562-244437 కాల్ చేయవచ్చన్నారు.