‘వీధి కుక్కలు, నిర్లక్ష్యపు డ్రైవర్లు.. ఫిట్ ఇండియా సాధ్యమేనా?’

జైపూర్‌లో ఉదయం సైక్లింగ్ చేస్తున్న మాజీ సైనికుడు నర్సా రామ్ జాజ్రాను వెనుక నుంచి SUV కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన వీడియో SMలో వైరల్ అయ్యింది. వీధుల్లో సరైన సైక్లింగ్/వాకింగ్ ట్రాక్‌లు లేకపోవడం, వీధి కుక్కలు, నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఫిట్‌నెస్ సాధ్యమేనా అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.