మేడారంలో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 13, 14 తేదీల్లో మేడారంలో సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గద్దెల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులను రానున్న మహాజాతర నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మేడారం జాతర పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సీఎం స్పష్టమైన గడువు విధించినట్లు తెలుస్తోంది.