ఎరువులు దుకాణాలు ఆకస్మిక తనిఖీ

PPM: పాచిపెంట మండలంలో పాచిపెంట, గురివినాయుడుపేట గ్రామాలలో ఎరువులు దుకాణాలను తహసీల్దార్ రవి, మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంతవరకు షాపుకు వచ్చిన ఎరువులు, ఏ రైతుకు అమ్మకాలు చేపట్టారు అనేది పరిశీలించారు. ఎరువులు ఎక్కువ ధరకు అమ్మవద్దని, ఎరువులు అమ్మినప్పుడు రైతులు యొక్క వివరాలు నమోదు చెయ్యాలని తెలిపారు.