లండన్‌లో సివిల్ ఇంజనీర్ చదువు.. నేడు ఉప సర్పంచ్
JGL: మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి వార్డు మెంబర్‌గా పోటీ చేసి విజయం సాధించిన ఆకుల రాకేష్ (30)కు ఉప సర్పంచ్ పదవి వరించింది. లండన్‌లో సివిల్ ఇంజనీర్ చదివిన రాకేష్ స్వగ్రామ అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.