VIDEO: ఉద్యోగం ఇచ్చి వెనక్కి తీసుకున్న అధికారులు..!

VIDEO: ఉద్యోగం ఇచ్చి వెనక్కి తీసుకున్న అధికారులు..!

WGL: పర్వతగిరి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో అసిస్టెంట్ కుక్ ఉద్యోగం విషయంలో బాధిత మహిళ మేడిశెట్టి సరిత గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తు, పరీక్షలు, ఇంటర్వ్యూ పూర్తయ్యాక డీఈవో కార్యాలయం నుంచి నియామక ఆర్డర్ కాపీ అందించారని తెలిపారు. ఒకరోజు పని చేయించిన అనంతరం ఉద్యోగం లేదని చెప్పారని ఆమె వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.