అచ్చంపేట ప్రాంతం శాంతికి ప్రతిరూపం: డీఎస్పీ

అచ్చంపేట ప్రాంతం శాంతికి ప్రతిరూపం: డీఎస్పీ

NGKL: అచ్చంపేట ప్రాంతం శాంతికి ప్రతిరూపమని డీఎస్పీ పల్లె శ్రీనివాస్ అన్నారు. గురువారం అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో పీస్ కమిటీ సమావేశాన్ని వివిధ కుల పెద్దలతో నిర్వహించారు. ఒకే నెలలో రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలు వస్తున్నాయని, దీంతో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఒకరినొకరు ప్రేమ అనురాగాలు ఆప్యాయతతో పండుగలను జరుపుకోవాలని సూచించారు.