గోల్ హనుమాన్ ఆలయంలో హుండీ లెక్కింపు

NZB: జిల్లా కేంద్రంలోని గోల్ హనుమాన్ దేవాలయము హుండీ లెక్కింపు పూర్తి అయిందని ఈఓ వేణు తెలిపారు. హుండీలు లెక్కింపు చేయగా మొత్తం రూ.21,479 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో బి.కమల, పరిశీలకులు దేవాదాయశాఖ (నిజామాబాద్) పర్యవేక్షణలో జరిగిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.