ఇంటింటికి తిరుగుతూ కేంద్రమంత్రి ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా రహమత్ నగర్ డివిజన్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన హామీల పేరుతో కాంగ్రెస్ ఏ రకంగా నమ్మకద్రోహం చేసిందో, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఎలా దివాళ తీసిందో ప్రజలకు వివరించారు.