జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు

MBNR: జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాను స్టడీ హబ్ తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తున్నానని వెల్లడించారు. అన్ని రంగాల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు, మొదటి ప్రాధాన్యతను ఇస్తానని పేర్కొన్నారు.