కొవ్వూరులో 'శక్తి యాప్' పై అవగాహన కార్యక్రమం

కొవ్వూరులో 'శక్తి యాప్' పై అవగాహన కార్యక్రమం

E.G: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'శక్తి యాప్'పై కొవ్వూరు టౌన్ పోలీసులు మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు యాప్ పనితీరును వివరించారు. ఆపద సమయంలో మహిళలు యాప్‌లోని SOS బటన్‌ను నొక్కితే, వెంటనే సమాచారం కంట్రోల్ రూమ్‌కు చేరుతుందని, తద్వారా నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారన్నారు.