స్క్రబ్ టైఫస్ కేసులు.. జిల్లా యంత్రాంగం అలెర్ట్
కృష్ణా: రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ డీ.కే. బాలాజీ తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో జ్వర కేసులపై ప్రత్యేక దృష్టితో పరీక్షలు, చికిత్స, మందుల నిల్వలు ఏర్పాటు చేశారు. ప్రజలు 3 రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.