మూడు ముక్కల్లో ఒక్క ఇటుక పెట్టలేదు: మంత్రి
W.G: మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ సీఎం జగన్‌పై ఇవాళ ధ్వజమెత్తారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో జగన్ ఇళ్లు కట్టుకున్నాడని, ఒక్క అంగుళం కూడా కదలదని వైసీపీ నేతలు చెప్పినట్లు తెలిపారు. కానీ.. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి మూడు ముక్కలు అన్నాడని పేర్కొన్నారు. పోనీ మూడు ముక్కల్లో కనీసం ఒక్క ఇటుక కూడా జగన్ పెట్టలేదని తెలిపారు.