పెద్దపులి కదలికలపై నిరంతరం నిఘా

ప్రకాశం: అర్ధవీడు మండలంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలపై నిఘా ఉంచామని మార్కాపురం డిప్యూటీ రేంజర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం అర్ధవీడు, కంభం పరిసర ప్రాంతాలలో ఉన్న అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఉన్నట్లు ఆయన తెలిపారు. పెద్దపులి కదలికలు గుర్తించేందుకు రాత్రిపూట కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రసాద్ రెడ్డి వ్యక్తం చేశారు.