నగరంలో నేడు వైన్స్ బంద్

నగరంలో నేడు వైన్స్ బంద్

HYD: హనుమాన్ జయంతి సందర్భంగా నేడు నగరంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. శోభాయాత్రల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఈ ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.