కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా సంగీతం శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా సంగీతం శ్రీనివాస్

కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్‌ను నియమిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పలువురు శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.