VIDEO: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, ఎంపీ

VIDEO: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, ఎంపీ

సత్యసాయి: సోమందేపల్లి మండలం నక్కలగుట్టలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రులు సత్యకుమార్, సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు. గ్రామస్థులు మంత్రులు, ఎంపీకి ఘన స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.