ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

KDP: సిద్ధవటం మండలం టక్కోలుకు చెందిన వాసంతి (31) అనే వివాహిత సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త శివానందరెడ్డి జీవనోపాధి నిమిత్తం కొన్ని నెలల క్రితం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. ఇంటి వద్దే ఉన్న ఆమె నిన్న మధ్యాహ్నం సమయంలో ఉరేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.