చిన్ననాటి స్నేహితుల ఆర్థిక సాయం

చిన్ననాటి స్నేహితుల ఆర్థిక సాయం

అన్నమయ్య: నందలూరు మండలంలోని స్థానిక బస్టాండులో వెంకటరమణ నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల అతనికి హార్ట్ స్ట్రోక్ రావడంతో గుండెకు స్టంట్ వేశారు. విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు పల్లె మాధవి, అల్లం అశోక్ కుమార్, బోనాసి నరసింహులు, శ్రీధర్, ఆనాల నరసమ్మ, నాగ సుబ్బయ్య, గులాం, కట్టా సుబ్బన్న రూ. 50 వేలు వెంకటరమణకు మంగళవారం అందజేశారు.