VIDEO: అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ

VIDEO: అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ

ప్రకాశం: మార్కాపురంలోని మున్సిపాలిటీ పరిధి సమీపంలో గురువారం కురిసిన వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.. రోడ్డుపై మురుగు నీరు చేరి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే మురుగు నీరు అంతా రోడ్డుపైకి చేరి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.