ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది: ఎమ్మెల్యే
MHBD: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొంటుందని, రైతులు ఎవరు అధైర్యపడవద్దని ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ అన్నారు. శనిగపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఉదయం ఆయన ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తూ అండగా ఉంటుందని తెలిపారు.