'ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
SRPT: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన వ్యక్తిని రిమాండ్‌కు పంపించినట్లు సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య గురువారం సాయంత్రం తెలిపారు. సూర్యాపేటకు చెందిన గడ్డం లక్ష్మణ్ ట్రేడింగ్ పేరుతో సూర్యాపేట, తిరుమలగిరి ప్రాంతాల్లో ప్రజలను మోసం చేసి రూ. 3 కోట్లు కాజేశాడని వివరించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.