కూకట్పల్లి దారిదోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
HYD: కూకట్పల్లిలో జరిగిన భారీ దారిదోపిడీ కేసులో పోలీసులు మెరుపు వేగంతో స్పందించి నిందితులను అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఘటన జరగగా ఇవాళ తెల్లవారుజామునే నిందితులను పట్టుకున్నారు. చోరీకి గురైన కోటి రూపాయల్లో రూ. 77 లక్షలకు పైగా నగదును రికవరీ చేశారు. ఈ కేసు పూర్తి వివరాలను మరికాసేపట్లో కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.