గుంతలు పూడ్చి నిరసన తెలిపిన BRS నాయకులు

గుంతలు పూడ్చి నిరసన తెలిపిన BRS నాయకులు

BDK: మణుగూరు నుంచి ఏటూరు నాగారం వెళ్లే మార్గం రోడ్లు గుంతల మయంగా మారి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని BRS నాయకులు లింగమల్ల శేఖర్ తన సొంత ఖర్చులతో ఈరోజు మిక్సర్ కంకర్‌తో మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుంతల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పాలకవర్గం విఫలం కావడంతో తన వంతుగా బాధ్యత నెరవేర్చినట్లు తెలిపారు.