శ్రీకాకుళంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు

SKLM: శ్రీకాకుళంలో జరుగు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్య వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఏ.అశోక్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.చందు, బి.హరీష్ బుధవారం పిలుపునిచ్చారు. ఈమేరకు శ్రీకాకుళంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు హాజరవుతారన్నారు.