నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VZM: బొబ్బిలి సబ్ డివిజన్ పరిదిలోని మక్కువ, పక్కి ఫీడర్ కింద చెట్ల కొమ్మలు తొలగించే నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE బి. రఘు తెలిపారు. ఈ మేరకు నారసిహునిపేట, మక్కువ, పక్కి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.