కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు

కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు

CTR: పలమనేరు పాతపేటలోని సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిగాయి. శ్రీ రుక్మణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిని బంగారు కవచంతో, వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించారు. అనంతరం కమిటీ వారు భక్తులకు దర్శన ఏర్పాట్లు, తీర్థ ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.