తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

JGL: గొల్లపెల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును పరిశీలించి, పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ తనిఖీలో ఆర్డీవో మధుసూదన్, గొల్లపెల్లి మండల తహసీల్దార్ ఎండీ మాజీద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.