పెదపాలపర్రులో వ్యక్తి అస్థిపంజరం లభ్యం
ELR: ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో పాడుబడిన పెంకుటింట్లో బుధవారం కుళ్లిపోయిన వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. పిల్లులు పట్టుకోవడానికి వెళ్లిన వ్యక్తి ఈ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వీరభద్రరావు వివరాలు సేకరించారు. నాలుగు నెలల క్రితం అదృశ్యమైన రైతు సంకురాత్రి తులసీ మాధవరావుగా బంధువులు గుర్తించారు