ఈనెల 17 నుంచి కార్తిక బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో
AP: తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఆలయంలో ఈనెల 17 నుంచి కార్తిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ ఈవో వెల్లడించారు. భక్తుల సూచనల మేరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ మేరకు నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.