ఇలా వదిలేస్తే ఎలా..?
VZM: కొండతామరాపల్లిలో మురుగు కాలువల నిర్మాణం పేరుతో తవ్వకాలు చేసి ఆరు నెలలు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు అడుగుల లోతులో తవ్విన గుంతల కారణంగా ఇళ్లలోకి వెళ్లడం కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ప్రమాద భయంతో అతికష్టం మీద రాకపోకలు సాగిస్తున్నారు.