VIDEO: 'శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల ప్రారంభం'

CTR: పుంగనూరు బ్రాహ్మణ వీధిలోని శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సహిత శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో 354వ వార్షిక ఆరాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్ర స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకాలు చేశారు. ప్రత్యేక అలంకరణ అనంతరం ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.