ఎన్నికల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు
ASF: జిల్లా, రెబ్బెన మండలంలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీ ఎత్తున వాహన తనిఖీలు చేపట్టారు. రెబ్బన బస్ స్టాండ్ వద్ద ఎస్సై వెంకటకృష్ణ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో చట్టవ్యతిరేక రవాణా, మద్యం, నగదు పంపిణీ అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని ధృవపత్రాలు పరిశీలించారు.