పందికొక్కుల దాడి.. నాలుగు నెలల చిన్నారి మృతి

పల్నాడు: జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. పందికొక్కులు దాడి చేయడంతో నాలుగు నెలల చిన్నారి మృతి చెందింది. నూజెండ్ల మండలం రవ్వారంలో గురవయ్య, దుర్గమ్మ దంపతులకు నాలుగు నెలల క్రితం బాలుడు జన్మించాడు. బుధవారం చిన్నారి నిద్రపోతుండగా తల్లి బయటికెళ్లింది. ఈ సమయంలో పందికొక్కులు చిన్నారిపై దాడి చేయగా చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి.