మే 4 నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

KDP: పెండ్లిమర్రి మండలం వెయ్యినూతల కోనలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మే 4 నుండి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త నరసింహ ప్రసాద్ మంగళవారం తెలిపారు. అంకురార్పణ, యాగశాల ప్రవేశం, రాజగోపుర, ధ్వజస్తంభ శిఖర కలశ స్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించ బడుతుందని ఆయన తెలిపారు.