బుమ్రాను ఎదుర్కోవడం కీలకం: స్మిత్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు టీమిండియాతో దక్షిణాఫ్రితా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంగా సౌతాఫ్రికాకు ఆ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ పలు సూచనలు చేశాడు. స్పిన్నర్ల కంటే ముందు బుమ్రా పదునైన పేస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం కీలకమని తెలిపాడు. మ్యాచ్‌లో నిలవడానికి చాలా కష్టపడాల్సి ఉందన్నాడు. అలాగే, రబాడను ఎదుర్కోవడం భారత్‌కు కీలకమని చెప్పాడు.