ప్రజా ప్రభుత్వంలోనే గ్రామీణ రోడ్లకు మహర్దశ: ఎమ్మెల్యే

KMM: ప్రజా ప్రభుత్వంలోనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ కలుగుతుందని ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. శుక్రవారం ఏన్కూరు మండల పరిధిలోని గార్లఒడ్డులో సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. పేదల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.