సింహాద్రి అప్పన్నకు తులసీ దళాలతో అర్చన

సింహాద్రి అప్పన్నకు తులసీ దళాలతో అర్చన

VSP: సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఇవాళ స్వర్ణ తులసీదళాలతో అర్చన చేశారు. గోవిందరాజస్వామితో పాటు ఉభయ దేవేరులను ఆలయ మండపంపై అర్చక స్వాములు అధిష్టింపజేశారు. స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళ వాయిద్యాలు నడుమ అర్చన కార్యక్రమాలు చేపట్టారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా మేలుకొలుపు సేవ నిర్వహించారు.