జిల్లా స్థాయికి ఎంపికైన సాలూర విద్యార్థులు
NZB: సాలూర విద్యార్థులు ఈ నెల 28, 29 తేదీల్లో NZBలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలకు విద్యార్థులను తీసుకెళ్లడానికి పీఎం శ్రీ నిధులు ఉపయోగపడుతున్నట్లు పీ.టీ సంగీత్ రావు బుధవారం తెలిపారు. గెలుపు కంటే పాల్గొనడమే ముఖ్యమని ఉపాధ్యాయులు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజీమంజుష, పీటీ సంగీత్ రావు పాల్గొన్నారు.