VIDEO: రాయచోటిలో క్రీడా స్టేడియం ఏర్పాటుకు అడుగులు

VIDEO: రాయచోటిలో క్రీడా స్టేడియం ఏర్పాటుకు అడుగులు

అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో రాయచోటి పట్టణంలో ఆధునిక క్రీడా స్టేడియం ఏర్పాటుకు శనివారం చర్యలు వేగవంతమయ్యాయి. పట్టణ పరిధిలోని మూడు ఎకరాల భూమిలో అధికారులు ల్యాండ్ సర్వే పనులు చేపట్టారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.