జంబులదిన్నెలో కల్వర్టు నిర్మాణానికి 40 లక్షలు

జంబులదిన్నెలో కల్వర్టు నిర్మాణానికి 40 లక్షలు

NDL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జి. జంబులదిన్నె వాగును సోమవారం పరిశీలించి, మృతదేహాల రవాణాకు ఇబ్బందులు రాకుండా కల్వర్టు అవసరమని కలెక్టర్‌తో చర్చించారు. కలెక్టర్ రూ. 40 లక్షలతో నెలలోపే కల్వర్టు నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలను, ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి భూమా కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.