VIDEO: దొంగతనాల ముఠా అరెస్ట్.. 3 తులాల బంగారం స్వాధీనం
జనగామ జిల్లా కేంద్రంలో రద్దీ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ పండేరి చేతన్ నితిన్ శుక్రవారం రాత్రి తెలిపారు. వారి నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెందిన వారిగా గుర్తించారు. నిందితులకు పలు రాష్ట్రాల్లో నేరచరిత్ర ఉందని ఏసీపీ తెలిపారు.