బ్యాంకుమిత్ర పాయింట్‌లో ప్రింటింగ్ సేవలు ప్రారంభం

బ్యాంకుమిత్ర పాయింట్‌లో ప్రింటింగ్ సేవలు ప్రారంభం

విశాఖ: బ్యాంకుమిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కొయ్యూరు ఏపీజీవీబీ బిఎమ్ సతీష్ కుమార్, ఐరిక్స్ స్టేట్ ఇంఛార్జ్ చిరంజీవి పేర్కొన్నారు. మంప బ్యాంకుమిత్ర కేంద్రంలో పాస్ బుక్ ప్రింటింగ్ సేవలను ప్రారంభించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకుమిత్రులు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మురళీకృష్ణ, నాగేశ్వరరావు సత్యనారాయణ రవి పాల్గొన్నారు.