ఉప్పల్‌లో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం

ఉప్పల్‌లో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం

మేడ్చల్: ఉప్పల్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. సత్యానగర్ కాలనీలో రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డులు, ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ.8 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ శుభ్రత కోసం సూపర్ సక్కర్ యంత్రంతో పనులు చేపట్టినట్టు తెలిపారు. కాలనీవాసులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.